
-వైరల్ గా మారిన ఐశ్వర్య లక్ష్మి వ్యాఖ్యలు
-సంబరాల యేటి గట్టుతో బిజీ
-లివింగ్ రిలేషన్ బెస్ట్ అంట
పెళ్లంటే పందిళ్లు చప్పట్లు తాళాలు, మేళాలు తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు.. కల్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే... శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం.. ఈ సాంగ్స్ వింటుంటే పెళ్ళి కాని వాళ్ళు అర్జంటుగా పెళ్లి చేసుకోవాలని, పెళ్లి అయిన వాళ్ళు ఆ అద్భుత ఘట్టాన్ని తలుచుకుని ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండని అనుకుంటూ ఉంటారు. పెళ్లికి భారతీయ సంప్రదాయంలో అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)మాత్రం పెళ్లి అవసరమా అంటుంది. మరి ఆ ముద్దుగుమ్మ ఒపీనియన్ ఏంటో చూద్దాం.
ఐశ్వర్య లక్ష్మి..లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(Manirathnam)నుంచి వచ్చిన పొన్నియన్ సెల్వం, థగ్ లైఫ్ తో ఫుల్ పాపులారిటీని పొందింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు గత ముప్పై ఏళ్ళ నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలని ఎంతో మందిని చూసా. వాళ్ళల్లో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది. పెళ్లి తర్వాత భాగస్వామి జీవితంలో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింప చేసాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే బాగస్వామి కావాలి. అయితే అది పెళ్ళితోనే సాధ్యం కాదు. ఇద్దరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే సహజీవనం బెటర్ అని చెప్పుకొచ్చింది.
also read: dhurandhar 2:బాలీవుడ్ దండయాత్ర.. టాలీవుడ్ కి ముప్పు
ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాకి బ్రాండ్ అంబాసిడర్ ని అనే స్థాయిలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. దీంతో ఆమె వ్యాఖ్యలతో సోషల్ మీడియా కలకలలాడుతూ ఉంది. మరి స్వతంత్ర భారతావనిలో డిఫరెంట్ మైండ్ సెట్స్ మనుషులు ఉంటారు కాబట్టి కొంత మంది ఆమె మాటలని ఏకీభవిస్తుంటే మరికొంత మంది వ్యతిరేకరిస్తున్నారు. ఆల్రెడీ సహజీవనం చేసిన చేస్తున్న వాళ్లైతే అన్ని రిలేషన్స్ లోను మనస్పర్ధలు వస్తుంటాయనే కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్(Sai dhurga Tej)తో 'సంబరాల ఏటిగట్టు'చేస్తుంది. తెలుగులో తనకి సెకండ్ మూవీ. 2017 నుంచి సౌత్ లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఐశ్వర్య లక్షి పక్కా మలయాళీ. ఎనీ క్యారక్టర్ తీసుకోండి. క్యారక్టర్ తప్ప తను కనపడదు. అంతలా మెస్మరైజ్ చెయ్యడం ఐశ్వర్య లక్ష్మికి కళ ఇచ్చిన గొప్ప వరం.






