Home

»

Latest News

పవన్ కళ్యాణ్ ది షాడో లోఅడవి శేషు

Apr 10, 2011 10:30AM

పవన్ కళ్యాణ్ "ది షాడో" మూవీలో యువ హీరో అడివి శేషు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. వివరల్లోకి వెళితే గతంలో "కర్మ" అనే విభిన్నకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన యువ హీరో, నిర్మాత, దర్శకుడు అయిన అడివి శేషు "ది షాడో" చిత్రంలో ఒక కీలకమైన డైనమిక్ పాత్రలో నటిస్తున్నారట. ఈ అడివి శేషు ప్రముఖ యువ దర్శకులు సాయికిరణ్ అడివికి సోదరులవుతారు. అర్కా మీడియా, సంఘమిత్ర పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారా జేన్ హీరోయిన్ గా, తమిళ దర్శకులు విష్ణు వర్థన్ దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం"ది షాడో".

 

ఈ చిత్రంలోనే హీరో పవన్ కళ్యాణ్ తో పాటు యువ హీరో అడివి శేషు కూడా ఒక కీలకమైన ముఖ్య పాత్రలో నటిస్తున్నారట. ఈ పవన్ కళ్యాణ్ "ది షాడో" మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ "ది షాడో" మూవీకి అబ్బూరి రవి సంభాషణలు వ్రాస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ "ది షాడో" మూవీ చిత్రంలో ఇంకా జాకీష్రాఫ్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ "ది షాడో" మూవీ ఈ నెలాఖరున కోల్ కత్తాలో ప్రారంభం అవుతుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com