
2018లో వచ్చిన 'గూఢచారి' సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో హాలీవుడ్ రేంజ్ స్పై యాక్షన్‌ని అందించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'G2' (Goodachari 2) ఆ గూఢచారి యూనివర్స్‌ని మరింత భారీగా, నెక్స్ట్ లెవల్‌లో ఆవిష్కరించబోతోంది.
అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.

'G2' సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌పై ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటోంది.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ స్పై థ్రిల్లర్‌లో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, వామిగా గబ్బి, మధు శాలిని, సుప్రియ యార్లగడ్డ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, ఏజెంట్ గోపి మార్క్ యాక్షన్ అడ్వెంచర్స్‌తో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
[Adivi Sesh G2 Release Date, Goodachari 2 Release Date, Adivi Sesh G2 Movie, G2 Release Date, Goodachari Sequel, G2 Release Date, Adivi Sesh, Emraan Hashmi, Wamiqa Gabbi, Telugu Film News]






