Home

»

Latest News

ఆదిపురుష్.. నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు

Jul 25, 2026 10:06PM

 

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)శ్రీరాముడు(Sriramudu)గా చేసిన పాన్ ఇండియా చిత్రం  'ఆదిపురుష్(adipurush). మూవీ హిట్ కాకపోయినా  'ఆదిపురుష్' ని మర్చిపోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అక్కడ ఉంది భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు, అభిమానుల ఆరాధ్య దైవం ప్రభాస్. సుమారు  600 కోట్ల బిగ్ బడ్జెట్‌తో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఎంతో ధీమా వ్యక్తం చేసింది. అయితే 2023 జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా చిత్రంలో శ్రీరాముడు, లంకేశ్వరుడు, ఆంజనేయుడి పాత్రల చిత్రీకరణ మరియు సంభాషణలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదానికి సరిగ్గా కేంద్ర బిందువుగా నిలిచారు బాలీవుడ్ ప్రముఖ రచయిత మనోజ్ ముంతాషిర్.

ముఖ్యంగా లంకా దహనం సమయంలో హనుమంతుడు చెప్పే "గుడ్డ నీ బాబుది, చమురు నీ బాబుది, నిప్పు కూడా నీ బాబుదే" అనే మాస్ డైలాగ్ శ్రీరామ భక్తులని, ప్రభాస్ అభిమానులని  తీవ్రంగా నొచ్చుకునేలా చేసింది. ఒక పవిత్రమైన ఇతిహాసంలో దైవ సమానుడైన ఆంజనేయుడి నోటి వెంట ఇలాంటి దిగజారిన, పరుష పదజాలాన్ని ఉపయోగించడం పట్ల హిందూ సంఘాలు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. వివాదం మొదలైన తొలి రెండు రోజులు, అంటే జూన్ 16 నుండి జూన్ 18 మధ్య కాలంలో, తన తప్పును ఒప్పుకోవడానికి మనోజ్ ముంతాషిర్ సుముఖంగా లేరు. జాతీయ టీవీ ఛానెళ్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ, "హనుమంతుడు దేవుడు కాదు, కేవలం ఒక భక్తుడు మాత్రమే" అని, గ్రామాల్లో కథలు చెప్పే శైలినే తాము వాడామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

రచయిత మనోజ్ ముంతాషిర్ తీసుకున్న ఈ మొండి వైఖరి పరిస్థితులను మరింత దిగజార్చింది. అభిమానుల ఆగ్రహం హద్దులు దాటి  చంపేస్తామంటూ లేఖల ద్వారా బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కవర్‌  కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. చివరికి ఈ సున్నితమైన అంశంపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో చిత్రయూనిట్ వెనక్కి తగ్గక తప్పలేదు. దాంతో థియేటర్లలో ఉన్న ప్రింట్లలో ఆ వివాదాస్పద సంభాషణలను మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా మనోజ్ ముంతాషిర్ రెండు చేతులు జోడించి ప్రజలకు, భక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు.

Also read: అల్లు అర్జున్ కి పోటీగా ధనుష్.. పక్కాగా విజయాన్ని అందుకుంటాడా!


వివాదం ముగిసినప్పటికీ, ఆ ఘటన తన జీవితంలో కలిగించిన తీవ్ర భావోద్వేగ ప్రభావాన్ని మనోజ్ ముంతాషిర్ తర్వాత ఇంటర్వ్యూలలో బహిరంగంగా పంచుకున్నారు. ఆదిపురుష్ సినిమాను డిఫెండ్ చేస్తూ మాట్లాడటం తన జీవితంలో చేసిన 100 శాతం అతిపెద్ద పొరపాటని, అది అహంకారంతో చేసిన తప్పిదమని ఆయన అంగీకరించారు. "ఆ రోజుల్లో నేను ఎంతో ఏడ్చాను, జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థం చేసుకున్నాను" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిపురుష్ కి ఓం రౌత్ దర్శకుడు. కృతి సనన్ సీతమ్మ వారుగా కనిపించారు. 

Prabhas, Adipurush, Manoj Muntashir

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com