Home

»

Latest News

ఎందుకిలా చేస్తోంది.. తెలుగు వారంటే అంత చులకనా?

Aug 12, 2025 12:25PM

కమల్‌హాసన్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలో ప్రవేశించి నటిగానే కాదు, సింగర్‌ కూడా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో దాదాపు 50 పాటలు పాడిన శ్రుతి.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది. పలు భాషల్లో సినిమాలు చేసినప్పటికీ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ గబ్బర్‌ సింగ్‌. అయితే ఈమధ్య తెలుగు సినిమాలు చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా వాటిపై కూడా శ్రద్ధ పెట్టడం లేదని తెలుస్తోంది. అడివి శేష్‌ హీరోగా చేస్తున్న డెకాయిట్‌ సినిమాలో మొదట శ్రుతిహాసన్‌ హీరోయిన్‌ అనుకున్నారు. దానికి సంబంధించిన టీజర్‌ కూడా రిలీజ్‌ చేశారు. కానీ, సడన్‌గా ఆమె స్థానంలోకి మృణాల్‌ ఠాకూర్‌ వచ్చి చేరింది. 

ప్రస్తుతం తెలుగులో ఆమె చేస్తున్న సినిమాలేవీ లేవు. ఆమె చేసిన చాలా సినిమాలు హిట్‌ అయినప్పటికీ సినిమాలు రాకపోవడానికి రీజన్‌ ఏమిటనేది ఆలోచిస్తే.. తను కావాలనే తెలుగు ఇండస్ట్రీని అవాయిడ్‌ చేస్తోందనే సమాధానం వస్తోంది. చాలా మంది హీరోయిన్లలాగే శ్రుతి కూడా దర్శకనిర్మాతలను బాగా ఇబ్బందులకు గురి చేసేదని తెలుస్తోంది. దాంతో ఆమె పట్ల వారికి ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. అందుకే వేరే హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా శ్రుతికి తెలుగు సినిమాల్లో ఛాన్స్‌ ఉండదు అని తెలుస్తోంది. తెలుగు సినిమాలపై ఆమె కూడా దృష్టి తగ్గించింది కాబట్టి ఇకపై టాలీవుడ్‌లో సినిమాలు చేసే అవకాశం లేదు. ఆమె చెయ్యాల్సిన ఒకే ఒక్క సినిమా సలార్‌2. ఈ సినిమా ముందుగానే కమిట్‌ అయింది కాబట్టి చెయ్యక తప్పదు. ఆగస్ట్‌ 14న విడుదల కాబోతున్న కూలీలో నటించింది శ్రుతి. సలార్‌ తర్వాత మరో సినిమా చెయ్యని శ్రుతిహాసన్‌కి ఈ సినిమా కీలకం అని చెప్పాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com