టాలెంట్ కంటే ‘కమిట్‌మెంట్’కే ప్రాధాన్యం.. నటి సెన్సేషనల్ కామెంట్స్!
on Feb 7, 2026

గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏదో ఒక సందర్భంలో హీరోయిన్లు తాము కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులమే అంటూ వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. హీరోయిన్లుగా వెండితెరపై వెలిగిపోవాలని ఎంతో మంది నటీమణులు ఇండస్ట్రీకి వచ్చి కమిట్‌మెంట్ బారిన పడి చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా మరో నటి తనకు ఇండస్ట్రీలో ఎదురైన ఇలాంటి ఇబ్బందుల గురించి ప్రస్తావించడంతో ఇప్ప్పుడిది చర్చనీయాంశంగా మారింది. మలయాళ నటి కని కుశృతి కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన ఇలాంటి విషయాల గురించి వ్యాఖ్యానించారు. కొందరు దర్శకనిర్మాతలు కమిట్‌మెంట్ కోసం ఎంతకైనా దిగజారతారని కొన్ని ఉదాహరణలు చెప్పారు.
మహేష్‌బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్’ చిత్రంలో నటించిన కనికుశతి.. కొన్ని మలయాళ చిత్రాల్లోనూ అద్భుతమైన నటన ప్రదర్శించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆమె కెరీర్ బాగానే కొనసాగుతున్న సమయంలోనే సినిమాల నుంచి తప్ప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అలా ప్రకటన చేయడం వెనుక అసలు కారణం లైంగిక వేధింపులేనని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
‘సినిమాలపై నాకు ఉన్న ఆసక్తితో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఇక్కడికి వచ్చాను. కానీ, ఇండస్ట్రీలో ప్రతిభ కంటే కమిట్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తారనే విషయం ఆలస్యంగా అర్థమైంది. అయితే ఈ విషయాలు నాతో మాట్లాడేందుకు భయపడేవారు. దాంతో మా అమ్మను కలిసి అవకాశాలు రావాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందే అంటూ డైరెక్ట్‌గా అడిగేవారు. ఈ తరహా వేధింపులు భరించలేకే సినిమాలకు దూరంగా వెళ్లిపోయాను. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మళ్లీ నటించాల్సి వస్తోంది’ అంటూ కంటితడి పెట్టుకొని తన ఆవేదనను వ్యక్తం చేశారు కని కుశతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



