
సినిమా ప్రపంచంలో గాసిప్స్, రూమర్స్ చాలా కామన్. ముఖ్యంగా హీరోల కన్నా హీరోయిన్స్ చుట్టూ రూమర్స్ అల్లేయడం మీడియాకు అలవాటే. కొందరు వీటిని సిల్లీగా తీసుకుంటే మరికొందరు సీరియస్‌గా తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి వారి జాబితాలోకి చేరిపోయింది సమంత. ప్రముఖ నటుడు నాగచైతన్యతో పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో సినిమాలను తగ్గించేసింది సమంత. ఇలాంటి పరిస్థితిలో తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించడానికి పచ్చజెండా ఊపింది. ఇంకేముంది మీడియాలో దీనిపై ఇష్టమొచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. హీరోయిన్గా కెరిర్ స్టార్ట్ చేసిన దగ్గర్నుంచి ఎన్నో రూమర్స్ సమంతపై వచ్చాయి. అయితే వాటిని చూసి మొదట్లో కంగారుపడ్డా..తర్వతర్వాత లైట్ తీసుకోవడం మొదలెట్టింది.
అయితే ఈ సారి మాత్రం సమంత ఈ గాసిప్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. "నాపై గాసిప్స్ చాలా ప్రచారం చేస్తున్నారు..అవి నా వ్యక్తిగత జీవితాన్ని వివాదం చేస్తున్నాయి. ఇది బాధాకరం, చర్చించడానికి దేశంలో చాలా మంచి విషయాలున్నాయి. ఎంత తేలిగ్గా తీసుకున్నా కొన్నిసార్లు బాధ కలుగుతోంది..అవి నా వ్యక్తిగత జీవితాన్ని బాధిస్తున్నాయని విచారం వ్యక్తం చేసింది". అయితే ఎప్పుడూ లేనిది సమంత ఇంతలా ఎందుకు రీయాక్ట్ అయ్యిందా అని మీడియా, సినీ జనాలు బుర్ర గొక్కుంటున్నారు.




.jpg)

