
అచ్చ తెలుగింటి నటి హోదాలో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి మీనా(Meena).. దాదాపు అందరి అగ్ర హీరోల సరసన జత కట్టి అగ్ర హీరోయిన్ ట్యాగ్ లైన్ ని సైతం అభిమానుల నుంచి దక్కించుకుంది. రీసెంట్ గా మీనా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మీనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అవి వైరల్ గా మారాయి.
మీనా మాట్లాడుతు కెరీర్‌లో అత్యధిక విజయాలు సాధించడానికి మరియు పరిశ్రమలో ఇంత పేరు తెచ్చుకోవడానికి వెంకటేష్ గారే ముఖ్య కారణం నా కెరీర్‌లో అత్యధిక హిట్ సినిమాలు వెంకటేష్‌తోనే వచ్చాయి. ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎంతో కంఫర్టబుల్‌గా, స్నేహపూర్వకంగా ఉండేది. కెరీర్ ప్రారంభంలో చాలా నిశ్శబ్దంగా ఉండేదాన్ని. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లతో కేవలం వృత్తిపరంగానే మాట్లాడేదానిని. అయితే బాలకృష్ణ మాత్రం సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ, నేను కూడా మాట్లాడించేలా ప్రోత్సహించేవారు.
Also read: ఆ పని కంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చోండి.. అల్లు అర్జున్ వ్యాఖ్యలు వైరల్
మోహన్ బాబుతో నా అనుభవం పూర్తిగా భిన్నంగా ఉండేది. "అల్లరి మొగుడు" సినిమా షూటింగ్ సమయంలో చాలా చిన్న వయస్సులో ఉన్నానని, అప్పట్లో మోహన్ బాబు గారు అల్లరి చేస్తూ, భయపెట్టేవారు. ఆ సమయంలో నాకు తెలుగు భాష సరిగ్గా రాకపోవడం వల్ల, సరదాగా మాట్లాడే మాటలు అర్థం కాక మొదట్లో కొంచెం భయం ఉండేది. కానీ, రానురాను ఆయన వెలుపలికి కనిపించే గంభీరత్వానికి భిన్నంగా లోపల ఎంతో మంచితనం ఉన్న 'స్వీట్‌హార్ట్' అని అర్థమైందని చెప్పారు. మోహన్ బాబు కుటుంబంతో, ఆయన పిల్లలైన లక్ష్మి, విష్ణు, మనోజ్‌లతో కలిసి అంతాక్షరి, మ్యూజికల్ చైర్స్ ఆటలు ఆడిన మధుర క్షణాలను మీనా గుర్తుచేసుకున్నారు.
Meena, Mohan Babu, Chiranjeevi, Nagarjuna, Venkatesh






