
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' మూవీ రేపు ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్లలో రిలీజవుతోంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో బజ్ లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు వారాల నుంచీ ఈ సినిమాకు బజ్, హైప్ తీసుకురావడానికి సినిమా యూనిట్ అంతా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. చిరంజీవి, రామ్‌చరణ్, కొరటాల ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ప్రి రిలీజ్ ఈవెంట్, ప్రి రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్సులు సరేసరి. అంతకంటే ముందు సాంగ్స్, టీజర్, ట్రైలర్ లాంటి వాటిని రిలీజ్ చేశారు.
ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆడియెన్స్ నుంచి ఆశించిన రీతిలో స్పందన రావట్లేదని విశ్లేషకులు అంటున్నారు. రేపు సినిమా రిలీజ్ అయితే, గురువారం సాయంత్రం నాటికి కూడా హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో షోలు ఫుల్ కాలేదని బుక్ మై షోలోని అడ్వాన్స్ బుకింగ్ తెలియజేస్తోంది. అనేక షోలు గ్రీన్ కలర్‌ను చూపిస్తున్నాయి. అంటే ఆ షోలలో 50 శాతం కూడా బుకింగ్ కాలేదన్న మాట. ఇది ఊహించని పరిణామంగా చెప్పాలి.
నిజానికి చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమాకు మార్కెట్‌లో కానీ, ఆడియెన్స్‌లో కానీ ఎంత హైప్ క్రియేట్ కావాలి! అలాంటిది ఇంత నీరసంగా బుకింగ్స్ ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి 'ఆచార్య' రిలీజ్‌కు ఇది రాంగ్ టైమ్‌గా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే జనం జేబులు 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాల కారణంగా ఖాళీ అయ్యాయి. 'ఆర్ఆర్ఆర్' టికెట్ ధరలు భారీగా పెరగడంతో హైదరాబాద్ సిటీలో నలుగురున్న ఫ్యామిలీకి రెండు వేల రూపాయలకు పైగా వ్యయమయ్యాయి. 'కేజీఎఫ్ 2' ఆ పరిస్థితిని పునరావృతం చేసింది.
ఇప్పుడు మరోసారి 'ఆచార్య' సినిమాకు అలా జేబును గుల్ల చేసుకోవడానికి ఆడియెన్స్ సిద్ధంగా లేరనీ, అందుకే అడ్వాన్స్ బుకింగ్ స్లోగా ఉందనీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రేపు సినిమా రిలీజై, మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉంటే 'ఆచార్య' బుకింగ్స్ స్పీడ్ అందుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






