
విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ టీజర్ తాజాగా విడుదలైంది. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, సరదా సంభాషణలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
వెంకటేష్ కుటుంబాన్ని మొదట మధ్యతరగతి కుటుంబంగా పరిచయం చేశారు. చిన్న ఉద్యోగంతో అప్పులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్టుగా వెంకటేష్ పాత్రను చూపించారు. ఆ తర్వాత లాటరీ లాంటిది తగిలి, ఆ ఫ్యామిలీ రిచ్ లైఫ్ చూస్తుంది. అంతవరకు బాగానే ఉంది కానీ, టీజర్ చివర్లో క్రైమ్ ఎలిమెంట్స్ చూపించడం సర్ ప్రైజింగ్ గా ఉంది. "నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని నాకు తెలుసు. కానీ, సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనకాడను" అంటూ వెంకటేష్ తనలోని వయలెంట్ యాంగిల్ ను చూపించాడు. మొదట్లో టీజర్ ఎంత సరదాగా ఉందో, చివర్లో టీజర్ అంత వయలెంట్ గా మారిపోయింది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు.. ఇది ఒక రకంగా షాక్ అని చెప్పొచ్చు.
వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.
[Aadarsha Kutumbam Teaser, AK47 Teaser Telugu, Aadarsha Kutumbam House No 47, Venkatesh, Trivikram, Srinidhi Shetty, Telugu Film News, Telugu News]






