Home

»

Latest News

వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్ చేసిన తమన్.!

Oct 7, 2026 1:13PM

వెంకటేష్–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శకుటుంబం హౌస్ నంబర్ 47’. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మారిన ఈ సినిమా.. అసలు ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ఓ పోస్ట్.. ఈ సస్పెన్స్‌కు తెరదించేసినట్టే కనిపిస్తోంది.

సినిమా పనులు పూర్తయిన సందర్భంగా తమన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ‘ఆదర్శకుటుంబం’ అక్టోబర్ 30న విడుదల కానుంది అన్నట్టుగా క్యాప్షన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అక్టోబర్ 30 అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

అయితే తమన్‌ కొద్దిసేపటికే ఆ పోస్టును ఎడిట్ చేశారు. అక్టోబర్ 30 అని ఉన్న చోట ఓ ఎమోజీని పెట్టేశారు. కానీ అప్పటికే తమన్ పోస్ట్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

దీంతో ఇప్పుడు అక్టోబర్ 30నే ‘ఆదర్శకుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

నిజానికి ఈ సినిమాకు రిలీజ్ డేట్ విషయంలో మొదటి నుంచీ గందరగోళమే కనిపిస్తోంది. తొలుత అక్టోబర్ 2న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 9కి వాయిదా వేశారు.

అక్టోబర్ 9న అయినా సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలైనప్పుడు నిర్మాత నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి మార్పు ఉండదని, అనుకున్నట్టుగానే అక్టోబర్ 9న సినిమా వస్తుందని చెప్పారు. కానీ చివరకు ఆ డేట్ కూడా క్యాన్సిల్ అయింది.

ఇప్పుడు తమన్ పోస్ట్‌తో అక్టోబర్ 30 డేట్ తెరపైకి వచ్చింది. మరి తమన్ పొరపాటున లీక్ చేసిన అక్టోబర్ 30 డేట్‌నే మేకర్స్ ఫైనల్ చేస్తారా? లేక మరోసారి రిలీజ్ డేట్ విషయంలో ట్విస్ట్ ఇస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: సప్తసాగరాలు సప్తగిరులు.. ఇండస్ట్రీ హిట్ తర్వాత పేరు మార్చుకొని వస్తున్న స్టార్ హీరో.!

 

 

 

[Aadarsa Kutumbam New Release Date, Aadarsa Kutumbam On Oct 30th, Aadarsa Kutumbam October 30 Release, Aadarsha Kutumbam House No 47, Victory Venkatesh, Trivikram Srinivas, S Thaman, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com