ENGLISH | TELUGU  

25 ఏళ్లుగా ఆ కోరిక తీరలేదంటున్న శ్రీమతి శ్రీయ.. షాక్ లో ఫ్యాన్స్ 

on Feb 12, 2026

 


-వైరల్ గా మారిన శ్రీయ మాటలు 
-25 ఏళ్ళు  అయిన ఆ కోరిక తీరలేదు
-ఇంతకి తన కోరిక ఏంటి!


'పాలకడలి' ని చిలికినప్పుడు తను కూడా ఈ భూమ్మీదకి వచ్చిందా అని శ్రీయ(Shriya)ని చూసినప్పుడు అనిపిస్తుంది. అంత సౌందర్యం శ్రీయ సొంతం. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న అందరి సూపర్ స్టార్స్ తో జోడి కట్టి నెంబర్ వన్ హీరోయిన్ అనే టాగ్ లైన్ ని పర్మినెంట్ హౌస్ అడ్రస్ గా మార్చుకుంది. కమర్షియల్ చిత్రాల్లోనే కాదు నటనకి మాత్రమే స్కోప్ ఉన్నచిత్రాల్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించిన నటీమణి.. తన సెకండ్  ఇన్నింగ్స్ లోను తన పెర్ఫార్మ్ లో ఉన్న సత్తా ఏ మాత్రం తగ్గలేదని గుర్తు చేస్తూ   'మిరాయ్' లో అంబికా ప్రజాపతి క్యారక్టర్ ద్వారా  అందరు సినిమాలో లీనమయ్యేలా చేసింది. రీసెంట్ గా శ్రీయ ఒక ఇంటర్వ్యూలో నాకు 25 సంవత్సరాలుగా తీరని కోరిక ఒకటుందని చెప్పి అభిమానులని షాక్ కి గురి చేసింది.

శ్రీయ మాట్లాడుతు  నాట్య కళాకారిణి క్యారక్టర్ లో నటించాలనే కోరిక 25  ఏళ్లుగా ఉండి పోయింది. అందులో భాగంగా ఒక నాట్యకళాకారిణి జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో చూపించే సినిమాలో చేయాలనీ ఉంది. అందుకు సంబంధించిన నృత్యం అనే నాకు ప్రాణం. ఎవరైనా అటువంటి క్యారక్టర్ ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.

 

Also read:  ఊహించని దర్శకుడుతో బాలయ్య మూవీ
  

తమ అభిమాన నటి మనసులోని కోరిక తీరుతుందా లేదా అనేదే అభిమానుల షాక్ కి కారణం. 2001 లో ఇష్టం అనే తెలుగు మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన  శ్రియ 2018 లో ఆండ్రీ కోచీవ్ ని  వివాహం చేసుకోగా ఆ ఇద్దరికి ప్రస్తుతం ఆ ఇద్దరికి ఒక పాప. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న దృశ్యం 3 లో చేస్తుంది. 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.