
నటన అనేది ఎంత కష్టమైన ప్రక్రియనో తెలిసిందే. ఒక క్యారక్టర్ ద్వారా నటుడు తాను అనుకున్న భావజాలం మొత్తాన్ని పండించాలంటే నరం తెగినంత పని అవుతుంది. అలాంటిది పురాణ పురుషులైన రాముడు, రావణుడుగా కనిపించి మెప్పించాలంటే నటనతో పాటు రూపురేఖలు, నడవడిక దాకా ఇంచు కూడా తేడా రాకూడదు.
అందుకు నటనలో ఎంతో నిష్ణాతులై ఉండాలి. అందుకే నేటి యంగ్ హీరోలైన రణబీర్ కపూర్, యష్ రామాయణలో రాముడు,రావణుడిగా కనిపించేసరికి ఇద్దరు ఎలా పెర్ఫార్మ్ చేస్తారనే ఆసక్తి అభిమానులు, సినీ ప్రేమికుల్లో నెలకొని ఉంది. మరి ఇద్దరిలో ఎవరు మెప్పించారో చూద్దాం
రాముడి క్యారక్టర్ కి కావాల్సిన ప్రశాంతత, అంతులేని దయ, శాంత స్వభావం, రాజసం వంటి సాత్విక లక్షణాలని రణ్‌బీర్ తన ముఖ కవళికల ద్వారా అత్యంత సహజంగా ఆవిష్కరించారు. అయోధ్య కాండలో తండ్రి దశరథుడు, కైకేయి సన్నివేశాల్లో రణ్‌బీర్ కపూర్ అభినయం ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉందని, ఇది కేవలం నటన మాత్రమే కాకుండా ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. యుద్ధ సన్నివేశాల్లో చూపిన పరాక్రమం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
.webp)
మరోవైపు, లంకేశ్వరుడిగా నటిస్తూ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టిన యశ్ ఈ చిత్రానికి మరో బలమైన మూలస్తంభంగా నిలిచారు. రావణాసురుడి పాత్రలో యశ్ చూపిన క్రూరత్వం, భయానకమైన స్వభావం, మరియు సరికొత్త పది తలల రూపం ప్రేక్షకులకు ఒక నూతన దృశ్య అనుభూతిని అందించాయి.
ఇది కూడా చదవండి: గత రామాయణ చిత్రాలకి, ఇప్పటి రామాయణకి ఉన్న తేడా ఇదే!
యశ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి 45 నిమిషాల భాగం, అలాగే జటాయువుతో జరిగే భీకరమైన పోరాట సన్నివేశాలు ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ విజువల్స్ అని ఆడియన్స్ కొనియాడుతున్నారు. స్క్రీన్ మీద యశ్ కనిపించిన ప్రతీసారీ థియేటర్లలో ఈలలు, గోలలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. రావణుడిగా అయన చేసిన అసుర ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి.
.webp)
ఈ విధంగా ఇద్దరు దిగ్గజాలు తమ క్యారెక్టర్స్ లలో వంద శాతంన్యాయం చేస్తూ, ఎవరికివారే సరిసమానంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేశారని సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.రామాయణ టాక్ కూడా పాజిటివ్ గానే వస్తుండటంతో థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొని ఉంది. సెల్యులాయిడ్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం పక్కా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు: Ramayana Movie Review Telugu: రామాయణం మూవీ రివ్యూ
[Ranbir Kapoor Ram vs Yash Ravana, Ramayana Movie Review Telugu, Ramayana Part 1 Movie Review Telugu, Ramayana Part 1 Review, Ranbir Kapoor Ramayana Movie Review, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]






