Home

»

Latest News

ఆకట్టుకుంటున్న పునీత్ చివరి సినిమా 'జేమ్స్' టీజర్!

Feb 11, 2022 11:29AM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ గతేడాది అక్టోబర్ 29 న గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పునీత్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' పునీత్ జయంతి సంద‌ర్భంగా మార్చి 17న విడుద‌ల‌వుతోంది. ఈ సినిమా కోసం పునీత్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడులైంది.

'జేమ్స్' మూవీ టీజర్ ని శుక్రవారం రిలీజ్ చేశారు. వరల్డ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. 'వ్యాపారం కంటే భావోద్వేగాలు పెద్దవి' అంటూ జేమ్స్ చెప్పిన మాటతో టీజర్ ప్రారంభమైంది. గ్రాండ్ విజవల్స్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో హాలీవుడ్ సినిమాలను తలపించేలా టీజర్ ఉంది. జేమ్స్ పాత్రలో పునీత్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. జేమ్స్ ని ఢీకొట్టే వ్యక్తిగా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఆకట్టుకున్నాడు.

చేత‌న్ కుమార్ డైరెక్ట్ చేసిన 'జేమ్స్' మూవీని క‌న్న‌డ తో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో శ్రీ‌కాంత్‌, షైన్ శెట్టి, తిల‌క్‌, చిక్క‌న్న కీల‌క పాత్ర‌లు చేశారు. పునీత్ గౌర‌వార్ధం 'జేమ్స్' విడుద‌లైన వారం కర్ణాటకలోని మొత్తం థియేట‌ర్ల‌లో ఆ సినిమా ఒక్క‌దాన్నే ఆడించాల‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు నిర్ణ‌యించారు. 'జేమ్స్‌'లో పునీత్ పాత్ర‌కు ఆయన సోదరుడు శివ రాజ్‌కుమార్ డ‌బ్బింగ్ చెప్పడం విశేషం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com