Allu Arjun: మాట మార్చిన కావేరి.. అల్లు అర్జున్ 42 రూల్స్ నిజామా కాదా?
on Feb 17, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)పై ఇటీవల ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా (Kaveri Baruah) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. ఈ క్రమంలో తాజాగా కావేరి కీలక ప్రకటన చేసింది.
ఒక పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న కావేరి బారువా.. అల్లు అర్జున్ పై ఊహించని కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ మేనేజర్స్ కఠినంగా ఉంటారని, ఆయనతో యాడ్ షూటింగ్ టైంలో ఏకంగా 42 నిబంధనలు పెట్టారని కావేరి తెలిపింది. కళ్ళలోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఫోన్ మాట్లాడకూడదు అంటూ ఎన్నో రూల్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.

కావేరి కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అల్లు అర్జున్ దగ్గర ఇన్ని రూల్స్ ఉంటాయా? కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరా? కళ్ళలోకి చూడనివ్వరా? అంటూ నెటిజెన్లు ఆశ్చర్యపోయారు. అయితే బన్నీని దగ్గర నుంచి చూసినవారు మాత్రం.. అవన్నీ ఫేక్ కామెంట్స్ అని కొట్టిపడేశారు.
అల్లు అర్జున్ టీమ్ సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కావేరి వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తన వ్యాఖ్యలు వివాదమవ్వడంతో కావేరి బారువా దిగొచ్చింది. తన కామెంట్స్ ని వెనక్కి తీసుకోవడమే కాకుండా, క్షమాపణలు చెప్పింది. "అల్లు అర్జున్ ని కలిసినప్పుడు.. చేయాల్సినవి చేయకూడనివి అంటూ 42 రూల్స్ తో నాకు ఎవరూ ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వలేదు. ఆ మాటలు పాడ్‌కాస్ట్ లో అనుకోకుండా దొర్లాయి. నిరాధారమైన నా వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్ఠకు భంగం వాటిల్లినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను." అని కావేరి చెప్పుకొచ్చింది.
కావేరి బారువా తాజా వ్యాఖ్యలతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
Also Read: తెలుగు సినిమాకు కొత్త తలనొప్పి.. చిన్న సినిమాలకే ఈ పరిస్థితి ఎందుకు?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



