Home

»

Latest News

భీమ్లా నాయక్ కి భారీ దెబ్బ.. ఒక్కసారిగా కలెక్షన్స్ డ్రాప్!

Mar 04, 2022

ఆరు రోజుల్లోనే 'వకీల్ సాబ్' టోటల్ కలెక్షన్స్ ని క్రాస్ చేసిన 'భీమ్లా నాయక్' ఏడో రోజు ఊహించని విధంగా డ్రాప్ అయింది. ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలేకపోయింది. ఆరు రోజులుగా కలెక్షన్ల తుఫాన్ సృష్టించిన ఈ సినిమా ఒక్కసారిగా డ్రాప్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రూ.106.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ 108 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆరోజు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల షేర్ కలెక్ట్ చేసి వకీల్ సాబ్ టోటల్ కలెక్షన్స్(రూ.86.36)ని దాటేసింది. ఈ మూవీ ముందు ముందు మరిన్ని కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటుతుందనుకుంటే, ఏడో రోజు ఊహించని దెబ్బ పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు రూ.3.32 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ఏడో రోజు 98 లక్షలకు పరిమితమైంది. అంటే ఆరో రోజుతో పోల్చితే ఏడో రోజు 65 శాతానికి పైగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 89.60 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన భీమ్లా నాయక్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 18.40 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 88.75 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఏడు రోజుల్లో 70.40 కోట్లు రాబట్టింది. తెలంగాణలో 33.22 కోట్లు(35 కోట్ల బిజినెస్), ఆంధ్రప్రదేశ్ లో 37.18 కోట్లు(53.75 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 9 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ ఆరు రోజుల్లో 11.55 కోట్లు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా 9 కోట్ల బిజినెస్ చేసిన మూవీ ఇప్పటిదాకా 7.65 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఈ వీకెండ్ భీమ్లా నాయక్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుందేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com