Home

»

Latest News

అమెరికాలో మెగాస్టార్: ‘కాకా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే.?

Nov 5, 2026 4:01PM

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాకా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ పాటను డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు సంగీత దర్శకుడు థమన్ తాజాగా వెల్లడించారు. అంతేకాదు.. ఆ సమయంలో చిరంజీవి అమెరికాలో ఉండబోతున్నారని చెప్పడంతో ఇప్పుడు ఈ అప్‌డేట్ ఆసక్తికరంగా మారింది.

థమన్ చిరంజీవితో కలిసి సెట్స్ లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇంతకీ చిరంజీవి అమెరికాకు ఎందుకు వెళ్తున్నారు? ఫస్ట్ సాంగ్‌ను అక్కడే విడుదల చేయబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది.

'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'కాకా'పై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌తో ప్రమోషన్స్ కూడా ఊపందుకోనున్నాయి.

ఇక 'కాకా' సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సినిమా వాయిదా పడుతుందని ఇటీవల ప్రచారం జరిగింది. చిత్ర బృందం మాత్రం ప్రకటించిన తేదీ ప్రకారమే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫస్ట్ సింగిల్ తో డిసెంబర్ నుంచి ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: 
‘దాదా’ ఫస్ట్ సింగిల్.. బాలయ్య ఫ్యాన్స్ కోసం తమన్ అదిరిపోయే ట్రీట్.!

ఈ సినిమాలో చిరంజీవి కూతురిగా మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మొత్తానికి డిసెంబర్‌లో రాబోతున్న ఫస్ట్ సింగిల్‌తో 'కాకా' ప్రమోషన్స్ జోరు అందుకోనున్నాయి. మరి చిరంజీవి అమెరికా పర్యటన వెనుక ప్రత్యేక కార్యక్రమం ఏదైనా ఉందా? కేవలం సాంగ్‌ లాంచ్ కోసమే వెళ్తున్నారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

మీకు నచ్చవచ్చు: 
'ఇట్లు అర్జున' హీరో అనీష్ ఎవరు?.. నాగార్జున, ఎన్టీఆర్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదేనా.?
గాడ్ ఆఫ్ వార్.. త్రివిక్రమ్, ఎన్టీఆర్‌కు అసలైన పరీక్ష.!

 

 

 

[Kaaka First Single Update,  Kaaka First Song, Chiranjeevi US Tour, Kaaka Movie, Chiranjeevi, Bobby Kolli, Anaswara Rajan, Thaman, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com