Home

»

Latest News

రాయలసీమలో బాలయ్య 'అఖండ' వంద రోజుల వేడుక

Mar 09, 2022

'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. గతేడాది డిసెంబర్ 2 న విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. రూ.75 కోట్లకు పైగా షేర్ రాబట్టి, 20 కోట్లకు పైగా లాభాలు చూసింది. ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా త్వరలో వంద రోజులు పూర్తి చేసుకోనుంది.

సినిమాలు 50 రోజులు, 100 రోజుల వేడుకలు జరుపుకునే రోజులు ఎప్పుడో పోయాయి. కానీ ఈ ట్రెండ్ ని మళ్ళీ అఖండ తీసుకొస్తోంది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా రారా అన్న సందిగ్దంలో సినీ పరిశ్రమ ఉన్న సమయంలో అఖండ విడుదలై థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొనేలా చేసింది. ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టారు. దాంతో మిగతా సినిమాలకు ధైర్యం కలగడమే కాకుండా.. అఖండ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వంద రోజుల వేడుకకు సిద్ధమైంది.

కృతజ్ఞత సభ పేరుతో అఖండ టీమ్ వంద రోజుల వేడుక నిర్వహించనుంది. ఈ నెల 12 న సాయంత్రం 5 గంటల నుంచి కర్నూల్ లోని ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. అభిమానుల సమక్షంలో ఘనంగా జరగనున్న ఈ వేడుకలో మూవీ టీమ్ పాల్గొననుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com