Home

»

Latest News

‘వారణాసి’ వాయిదాపై క్లారిటీ.. ఆగస్టు 9న బిగ్ అప్‌డేట్.!

Jul 31, 2026 11:10AM

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న విజువల్ వండర్ ‘వారణాసి’ థియేటర్లలోకి అడుగుపెట్టడానికి సరిగ్గా మరో 250 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ ప్రియులు, సూపర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ గ్లోబ్-ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా 2027 ఏప్రిల్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. 

నిజానికి ‘వారణాసి’ మూవీ 2027 ఏప్రిల్ 7న విడుదల కావడం అనుమానమనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని కూడా వార్తలొచ్చాయి. "సరిగ్గా 250 రోజుల్లో ఏప్రిల్ 7న వారణాసి వస్తోంది" అంటూ తాజాగా మూవీ టీమ్ ప్రకటించి వాయిదా వార్తలకు చెక్ పెట్టింది.

ఈ భారీ ప్రాజెక్ట్ థియేట్రికల్ రిలీజ్‌కు 250 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో విపరీతమైన హంగామా నెలకొంది. #Varanasi హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ ను షేక్ చేస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ పోషిస్తున్నారు. శ్రీరాముడి పాత్రలోనూ కనువిందు చేయనున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో అలరించబోతున్నారు. 

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో పాటు వారాణసి నగరానికి దూసుకొచ్చే ఆస్టరాయిడ్ ప్రమాదం, త్రేతాయుగం బ్యాక్‌డ్రాప్‌ చుట్టూ ఈ కథ నడుస్తుందనే ప్రచారం సినీ ప్రియులలో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఇదిలా ఉంటే, మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న ఉండటంతో, ఆ ప్రత్యేక రోజున మేకర్స్ నుంచి ఏమైనా క్రేజీ అప్‌డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

 

250 Days To Varanasi, Mahesh Babu, SS Rajamouli

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com