
ముద్దులున్న సినిమాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్ 100’ తెలుగులో ట్రెండ్ సృష్టించాయి. ఆ సినిమాల తరవాత ముద్దులతో ప్రేక్షకులను ఆకర్షించాలని కొంతమంది దర్శకులు, రచయితలు, నిర్మాతలు ప్రయత్నించారు కానీ... ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్ 100’ తరవాత ఆ సినిమాల స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ‘24 కిస్సెస్’. టైటిల్‌లోనే ముద్దులున్నాయి. టీజర్‌లో, ట్రైలర్‌లో ముద్దలు ఘాటుగా వున్నాయి. ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే... ముద్దుల వల్ల సినిమాలు హిట్ కావని ‘24 కిస్సెస్’ చిత్రదర్శకుడు, నిర్మాతలలో ఒకరైన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి అంటున్నారు. ముద్దుల కంటే కథలో కంటెంట్ ముఖ్యమనీ, ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాలు హిట్టయ్యాయంటే ఆయా సినిమాల్లో కంటెంటే కారణమనీ, ముద్దులు కాదని ఆయన వ్యాఖ్యానించారు. తన ‘24 కిస్సెస్’లో కంటెంట్ బావుంటుందని ఆయన అన్నారు. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. సినిమా హిట్టవుతుందని సినిమా టీమ్ కాన్ఫిడెంట్‌గా వుంది.






