Home

»

Latest News

`మ‌న్మ‌థుడు`గా నాగ్ మెస్మ‌రైజ్ చేసి నేటికి 19 ఏళ్ళు!

Dec 20, 2021 11:31AM

తెలుగునాట రొమాంటిక్ డ్రామాల‌కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన క‌థానాయ‌కుల్లో కింగ్ నాగార్జున ఒక‌రు. మ‌రీముఖ్యంగా.. త‌మ హోమ్ బేన‌ర్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో త‌ను స్వ‌యంగా నిర్మించిన ఈ త‌ర‌హా చిత్రాలు నాగ్ కి మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చాయి. వాటిలో.. `మ‌న్మ‌థుడు` సినిమా ఒక‌టి. ఇందులో ప్రేమికుడుగా, స్త్రీ ద్వేషిగా రెండు కోణాలున్న అభిరామ్ పాత్ర‌లో ఒదిగిపోయారు నాగార్జున‌. అంతేకాదు.. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మ‌రైజ్ చేసి సినిమా టైటిల్ కి న్యాయం చేకూర్చారు. కె. విజ‌య భాస్క‌ర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ క‌థ‌, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. నాగ్ కి జోడీగా సోనాలి బింద్రే, అన్షు న‌టించిన ఈ సినిమాలో చంద్ర‌మోహ‌న్, త‌నికెళ్ళ భ‌ర‌ణి, సుధ‌, బాల‌య్య‌, బ్ర‌హ్మానందం, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం, సునీల్, రంగ‌నాథ్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, అనంత్, స్వ‌ప్న మాధురి, అనితా చౌద‌రి, శివ పార్వ‌తి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌గా.. రేఖ‌, కీర్తి చావ్లా ఓ పాట‌లో త‌ళుక్కున మెరిశారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీల‌కు  `సిరివెన్నెల` సీతారామ‌శాస్త్రి, భువ‌న‌చంద్ర సాహిత్య‌మందించారు.   ``నా మ‌న‌సునే``, ``గుండెల్లో ఏముందో``, ``డోన్ట్ మ్యారీ``, ``అంద‌మైన భామ‌లు``, ``నేను నేనుగా లేనే``, ``చెలియా చెలియా``.. ఇలా ఇందులోని గీతాల‌న్ని విశేషాద‌ర‌ణ పొందాయి. `ఉత్త‌మ చిత్రం` విభాగంలో `నంది` పుర‌స్కారం అందుకున్న `మ‌న్మ‌థుడు`.. క‌న్న‌డంలో `ఐశ్వ‌ర్య‌` (దీపికా ప‌దుకోణ్ తొలి సినిమా), బెంగాలీలో `ప్రియోతోమా` పేర్ల‌తో 2006లో రీమేక్ అయింది. 2002 డిసెంబ‌ర్ 20న విడుద‌లై ప్ర‌జాద‌ర‌ణ పొందిన `మ‌న్మ‌థుడు`.. నేటితో 19 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com