Home

»

Latest News

`చెన్న‌కేశ‌వ‌రెడ్డి`గా బాల‌య్య అల‌రించి నేటికి 19 ఏళ్ళు!

Sep 25, 2021 12:18PM

ఒక ద‌శ‌లో ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ సినిమాల‌కు చిరునామాగా నిలిచారు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఇండ‌స్ట్రీ హిట్ `స‌మ‌ర‌సింహారెడ్డి`(1999)తో ఈ త‌ర‌హా చిత్రాల‌కు ఊపుతెచ్చిన బాల‌య్య‌.. ఆపై `న‌ర‌సింహ‌నాయుడు`(2001) రూపంలో మ‌రో ఇండ‌స్ట్రీ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ త‌రువాత వ‌చ్చిన `చెన్న‌కేశ‌వ‌రెడ్డి`(2002)తో ఫ్యాక్ష‌నిజాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్ళారు.  ఇందులో ఫ్యాక్ష‌నిస్ట్ చెన్న‌కేశ‌వ‌రెడ్డిగా, పోలీసాఫీస‌ర్ భ‌ర‌త్ గా తండ్రీకొడుకుల పాత్ర‌ల్లో ద్విపాత్రాభిన‌యం చేసి అల‌రించారు బాల‌య్య‌. `ఆది`(2002) వంటి సెన్సేష‌న్ హిట్ త‌రువాత స్టార్ కెప్టెన్ వీవీ వినాయ‌క్ రూపొందించిన ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కి జంట‌గా ట‌బు, శ్రియ న‌టించ‌గా దేవ‌యాని, పృథ్వీరాజ్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బ్ర‌హ్మానందం, మోహ‌న్ రాజ్, ఆనంద్ రాజ్, చ‌ల‌ప‌తిరావు, దేవ‌న్, అలీ, ఎల్బీ శ్రీ‌రామ్, వేణుమాధ‌వ్, ఎమ్మెస్ నారాయ‌ణ‌, అన్న‌పూర్ణ‌, ర‌ఘుబాబు, నాగినీడు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు, నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బ‌లంగా నిలిచాయి. పాట‌ల్లో ``హాయి హాయి`` చార్ట్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌గా.. ``నీ కొప్పులో``, ``డోంట్ కేర్``, ``బ‌కరా బ‌క‌రా``, ``ఏం పిల్లా కుశ‌ల‌మా``, ``తెలుపు తెలుపు`` కూడా అల‌రించాయి. శ్రీ సాయిగ‌ణేశ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మించిన `చెన్న‌కేశ‌వ‌రెడ్డి`.. 2002 సెప్టెంబ‌ర్ 25న విడుద‌లై నంద‌మూరి అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. నేటితో ఈ చిత్రం 19 వసంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com