Home

»

Latest News

జూన్ 24 న రానున్న సిద్ధార్థ 180 చిత్రం

Jun 7, 2011 9:19AM

జూన్ 24 న రానున్న సిద్ధార్థ "180" చిత్రం అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. వివరాల్లోకి వెళితే సత్యం సినిమా పతాకంపై, సిద్ధార్థ హీరోగా, నిత్య మీనన్ ‍, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా, యాడ్ ఫిల్మ్ మేకింగ్ లో విశేష అనుభవమున్న జయేంద్ర దర్శకత్వంలో సత్యం సినిమా, అగళ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "180". ఈ సినిమా జూన్ నెలాఖరున అంటే జూన్ 24 వ తేదీన విడుదల కానుందని సమాచారం. ఈ సిద్ధార్థ "180" సినిమాకి అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ శరత్ సంగీతాన్నందించారు.

సిద్ధార్థ "180" సినిమాకి వనమాలి పాటలు వ్రాశారు. జీవితాన్ని ఎలా అందంగా జీవించాలో ఈ సినిమాలో చెప్పటానికి ప్రయత్నించినట్టు సమాచారం. రేపు మనచేతిలో లేదు...నిన్న గడచిపోయింది...మనచేతిలో ఉంది నేడు ఒక్కటే కనుక గతాన్ని మరచిపోయి, భవిష్యత్తు గురించి తలపగలగొట్టుకోకుండా నేటి జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలా అన్న ఫిలాసఫీతో బ్రతికే కుర్రాడి పాత్రలో హీరో సిద్ధార్థ ఈ సినిమాలో నటిస్తున్నాడట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com