ఏప్రెల్ 29 న నాగచైతన్య హీరోగా నటిస్తున్న"100% లవ్" చిత్రం రిలీజ్ కానుందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ నాగచైతన్య హీరోగా నటిస్తున్న"100% లవ్" చిత్రం షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుందని తెలిసింది. గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బేబీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ చిత్రం "100% లవ్". ఈ చిత్రంలో శ్రీకాంత్ (తమిళ హీరో) నాగచైతన్యకు అన్నయ్యగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని ఏప్రెల్ నెల ప్రారంభంలో విడుదల చేస్తారని తెలిసింది.
ఈ నాగచైతన్య హీరోగా నటిస్తున్న"100% లవ్" చిత్రాన్ని మాత్రం వేసవి శలవుల్లో అంటే ఏప్రెల్ 29 వ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అయితే రానా, ఇలియానా "నేను-నా రాక్షసి" కూడా ఏప్రెల్ 29 నే విడుదల కానుందని సమాచారం. అంటే బావ రానా "నేను-నా రాక్షసి", బావమరిది నాగచైతన్య100% లవ్" సినిమాలు ఒకే రోజున విడుదల కానున్నాయి. మరి ఈ బావ బావమరుదుల సవాల్ లో గెలుపెవరిదో కాలమే చెప్పాలి.




.jpeg)

