నాగచైతన్య "100% లవ్" రిలీజ్ మే 6 న కానుందని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన చిత్రం "100% లవ్". నాగచైతన్య "100% లవ్" చిత్రాన్నిముందుగా అనుకున్న ప్రకారం ఏప్రెల్ 29 వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే రోజున రానా హీరోగా, నలక నడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం "నేను- నా రాక్షసి" కూడా అరిలీజవుతుండటంతో నాగచైతన్య "100% లవ్" చిత్రం విడుదలను మే ఆరవ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది.
అదీ గాక నాగచైతన్య, రానా బావా బావమరుదులవటం వల్ల బంధువుల మధ్య పోటీ ఎందుకులే అని ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అదీ గాక ఇంకా సి.జి. వర్క్ కూడా మిగిలి ఉండటం వల్ల ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రాన్ని మే 6 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు. ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రం యొక్క ఆడియో ఇప్పటికే విశేష ప్రేక్షకాదరణ పొందుతూంది.




.jpg)
(1).jpg)
