.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదో వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా మొదలైంది. క్లెయిమ్ కెప్టెన్సీ అనే ఈ టాస్క్‌లో ఇంట్లోని కంటెస్టెంట్లంతా పార్టిసిపేట్ చేశారు. గార్డెన్ ఏరియాలో ఫ్లోర్ మీద నంబర్లతో రాళ్లను పరిచాడు బిగ్ బాస్. ఏ నంబర్ చెప్తే ఆ నంబర్ ఉన్న రాయి మీద వెళ్లి కంటెస్టెంట్స్ నిల్చోవాలి. బజర్ మోగే వరకు ఎవరైతే ఆ రాయి మీద ఉంటారో వాళ్లే కెప్టెన్సీ కంటెండర్లుగా నిలుస్తారు. ఈ క్రమంలో అందరూ ఒకరినొకరు తోసేసుకున్నారు. ముఖేష్ అయితే మరీ దారుణంగా ప్రవర్తించాడు. ఫస్ట్ బజర్ మోగినప్పుడు అందరు కలిసి ఒక నంబర్ మీదకు వచ్చి నిల్చున్నారు. బజర్ మోగేసరికి తోసేసుకున్నారు. అందులో సుధీర్, ఆర్కే, శ్వేత బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ టాస్క్‌కి సంఛాలక్ గా మొదట వంశీ ఉన్నాడు. ఎవరి బాడీ బయట ఎక్కువగా ఉందని అడిగితే.. ఆర్కే, సుధీర్, శ్వేత అని వర్షిణి చెప్తుంది. మళ్లీ కథలు చెప్పకండి అని ముఖేష్ అంటాడు. కథలు ఎవరూ చెప్పడం లేదని వర్షిణి ఫైర్ అవుతుంది. నువ్వు నాకు చెప్పకని వర్షిణి అంటుంది. బజర్ లోపల ఆర్కే ఉన్నాడు.. నేను మాత్రం సుధీర్‌నే చూశానని శివ్ అంటాడు.
రెండో బజర్‌కి శ్వేత అయితే కింద పడిపోతుంది. ముఖేష్ అయితే అందరి మీద బరువు వేస్తాడు. కాళ్లు గాల్లోకి పెట్టి.. కింద ఉన్న వారి మీద బరువు వేస్తాడు. దీంతో పెద్ద గొడవ అవుతుంది. అలా కాళ్లు పైకి లేపి ఉంచడంపై వర్షిణి కూడా నోరు ఎత్తుతుంది. దీంతో ముకేష్ హర్ట్ అవుతాడు. ఇక రామ్ ప్రసాద్ సంఛాలక్ గా ఉన్నప్పుడు వర్షిణి సహాయం తీస్కుంటాడు.ఒకవైపు రామ్ ప్రసాద్, మరోవైపు వర్షిణి చూస్తుంటుంది. ఇక అందులో శ్వేత కాలు బయట ఉందని రామ్ ప్రసాద్ అనగా ముఖేష్ కాలు బయట ఉందని వర్షిణి అంటుంది. సాదారణంగా అప్పటిదాకా ఒక్కరినే గేమ్ నుండి తప్పించాలి కానీ బిగ్ బాస్ అప్పుడే ఒక ట్విస్ట్ ఇస్తాడు.ఈ సారి ఇద్దరిని తప్పించొచ్చు అని చెప్తాడు. దాంతో ముఖేష్, శ్వేత పేర్లు చెప్పేస్తాడు రామ్ ప్రసాద్. ఇక ఆ తర్వాత వర్షిణిని టార్గెట్ చేస్తాడు ముఖేష్.
నువ్వు నాతో ఇలా మాట్లాడకని వర్షిణి అంటుంది. నువ్వు కూడా నాతో ఇలా మాట్లాడకు.. నేను ఇలానే మాట్లాడతానని ముఖేష్ అంటాడు. నువ్వు పక్కకి వెళ్లు.. నువ్వు పక్కకు వెళ్లు అని ఇద్దరూ ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు.ముఖేష్ ని వర్షిణి టచ్ చేసి మాట్లాడటంతో ముఖేష్ మరింత ఫైర్ అవుతాడు. నన్ను టచ్ చేయకు అని ముఖేష్ అనడంతో వర్షిణి షాక్ అవుతుంది. ఇంతకుముందు ఫ్యామిలీ కోసం వర్షిణి త్యాగం చేసి ముఖేష్ కి ఛాన్స్ ఇచ్చింది. అలాంటి ఇద్దరి మధ్య ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లో చిచ్చు రేగడం హాట్ టాపిక్ అయింది.




.webp)

