![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ ఫూల్ అయిపోయాడు. అదీ ఓ బిచ్చగాడి చేతిలో. తనను ఇబ్బంది పెడుతున్న ఆ యాచకుడి నుంచి తప్పించుకోడానికి అతను సెక్యూరిటీ గార్డ్స్‌ను పిలవాల్సి వచ్చింది. తీరా వాళ్లు వచ్చేలోపు ఆశ్చర్యపోవడం హృతిక్ వంతైంది. కారణం.. హృతిక్‌ను ఫూల్‌ను చేసిన ఆ బిచ్చగాడెవరు? ఇంకెవరు.. ఆ వేషంలో వచ్చిన హాట్ బ్యూటీ విద్యా బాలన్. మగాడిగా మారువేషంలో వచ్చిన విద్యా బాలన్‌ను ఏమాత్రం గుర్తుపట్టలేకపోయాడట హృతిక్ రోషన్.
అసలు అతడిని ఆటపట్టించాలనే ఆలోచన విద్యకు ఎందుకు వచ్చింది? ఆరేళ్ల క్రితం ఆమె డిటెక్టివ్‌గా 'బాబీ జాసూస్' అనే సినిమాలో నటించిన విషయం గుర్తుందిగా.. ఆ మూవీలో క్యారెక్టర్ పరంగా విద్య పలు మారువేషాల్లో కనిపిస్తారు. ఆ కారణంగా ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబైలో మారువేషాల్లో తిరుగుతూ, అందర్నీ ఆటపట్టిస్తూ, ఆకట్టుకుంటూ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చారు. అందులో భాగంగానే హృతిక్‌ను కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేసి, ఆ టైమ్‌లో టాపిక్ ఆఫ్ ద బాలీవుడ్ అయ్యారు విద్యా బాలన్.
![]() |
![]() |