![]() |
![]() |

నిన్నటి తరం అగ్ర కథానాయకుల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న స్టార్ గా విక్టరీ వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక దశలో వరుస విజయాలతో పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించారాయన. అయితే కొన్నాళ్ళ క్రితం మాత్రం ఆ మ్యాజిక్ మిస్సయింది. ఈ తరుణంలో.. గురుతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావడమే కాకుండా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు వెంకీ.
గురు (2017), ఎఫ్ 2, వెంకీ మామ (2019).. ఇలా వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన ఈ మూడు వరుస సినిమాలూ విజయపథంలో పయనించాయి. చాన్నాళ్ళ తరువాత వెంకీ ఖాతాలో మరో హ్యాట్రిక్ జమ అయింది కూడా. ఈ నేపథ్యంలో.. వెంకీ నుంచి రాబోతున్న కొత్త చిత్రంపైనే అందరి దృష్టి ఉంది. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అసురన్'కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఆ సినిమానే 'నారప్ప'. ఇప్పటికే తన మేకోవర్ తో మెస్మరైజ్ చేసిన వెంకీ.. 'నారప్ప'తో వరుస విజయాల జోరుని కొనసాగిస్తారేమో చూడాలి. వచ్చే ఏడాది వేసవిలో 'నారప్ప' థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం.
![]() |
![]() |