![]() |
![]() |

న్యూడ్ వీడియో కేసులో అరెస్ట్ అయిన కాంట్రవర్షియల్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేకి బెయిల్ వచ్చింది. అయితే... వాళ్ళిద్దరూ వ్యక్తిగత పూచికత్తు కింద బెయిల్ బాండ్ రూ. 20 వేలు సమర్పించే వరకూ పోలీస్ స్టేషన్‌లోనే ఉండాలని గురువారం రాత్రి అదేశాలు వచ్చాయి. అలాగే, గోవా దాటి బయటకు వెళ్ళకూడదనే షరతు మీద ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
పూనమ్ పాండే, సామ్ బాంబే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. హనీమూన్ కోసం గోవా వెళ్ళగా... తనను లైగికంగా వేధించాడని భర్త సామ్ బాంబే మీద పూనమ్ పాండే కేసు పెట్టింది. అతణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత మళ్ళీ ఇద్దరూ కలవడం, గోవాలో న్యూడ్ వీడియో షూట్ చేశారని కేసు నమోదు కావడం తెలిసిన విషయాలే. అయితే... గోవా నుంచి ముంబయ్ వెళ్ళడానికి ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేసుకున్నారని సమాచారం అందడంతో పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్లు 292, 293, 294, 447... ఇండియన్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ (ఐఆర్‌డబ్ల్యూ) సెక్షన్లు 4, 6... ఐటీ యాక్ట్ 67–ఏ కింద కేసులు పెట్టారు.
![]() |
![]() |