![]() |
![]() |

నందమూరి బాలకృష్ణతో కలిసి శ్రియ మూడు సినిమాల్లో నాయికగా నటించింది. కెరీర్ ఆరంభంలోనే ఆయనతో 'చెన్నకేశవరెడ్డి' మూవీని చేసిన ఆమె చాలా ఏళ్ల తర్వాత రెండోసారి 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో ఆయన భార్య వాశిష్టీదేవి పాత్రను చేసింది. ముచ్చటగా మూడోసారి 'పైసా వసూల్' సినిమాలో ఆయన జోడీగా నటించింది. 'చెన్నకేశవరెడ్డి' సినిమా టైమ్‌కు ఆమె వయసు 18 సంవత్సరాలే. "ఆ సమయంలో నన్ను బాలయ్య, దర్శకుడు వినాయక్ నమ్మారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వాళ్లింటి అమ్మాయిలా చూసుకున్నారు. ఇప్పటికీ బాలయ్య పక్కనుంటే చాలా ప్రొటెక్టివ్‌గా అనిపిస్తుంది" అని చెప్పింది శ్రియ.
'గౌతమిపుత్ర శాతకర్ణి'లో శాతకర్ణిగా బాలయ్యను చూడ్డానికి రెండు కళ్లూ చాలవనేది ఆమె మాట. "ఆయన డైలాగులు చెబుతుంటే అసలు నేను ఈ లోకంలో ఉన్నాననే విషయాన్నే మర్చిపోయేదాన్ని. పూర్తిగా వేరే వేషధారణలో, పదునైన డైలాగులు చెబుతూ నటిస్తుంటే ఆయన్ను చూసి చాలా స్ఫూర్తి పొందేదాన్ని" అని శ్రియ తెలిపింది. ఇక 'పైసా వసూల్' సినిమాలో అయితే ఆయన ఎనర్జీ తనకు పవర్హౌస్లా అనిపించిందనేది శ్రియ చెప్పే మాట.

బాలకృష్ణ పరిచయం తర్వాతే పెద్దల్ని గౌరవించే తీరులో తనలో చాలా మార్పు వచ్చిందంటుంది శ్రియ. "బాలయ్య లాగా కన్నతండ్రిని గౌరవించే, ప్రేమించే, ఆరాధించే వ్యక్తిని నేను ఇప్పటిదాకా చూడలేదు. ఏమాత్రం ఖాళీ దొరికినా వాళ్ల నాన్నగారి విషయాలే చెబుతుంటారు. ఆయనలో నేను నేర్చుకున్న ఇంకో విషయం సంకల్పబలం. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటే అంతా మంచే జరుగుతుందనే విషయాన్ని తెలుసుకున్నా" అని చెప్పుకొచ్చింది శ్రియ.
.jpg)
![]() |
![]() |