![]() |
![]() |

గ్లామరస్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ తన సింపుల్, స్టైలిష్ ఎయిర్‌పోర్ట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇటు తెలుగు, అటు హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె హైదరాబాద్, ముంబైల మధ్య చక్కర్లు కొడుతున్న ఆమె తన కంఫర్టబుల్ ట్రావెల్ లుక్‌లో మరోసారి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. సింపుల్ టీ షర్ట్ పైన ఓవర్ సైజ్డ్ డెనిమ్ షర్ట్ ధరించి కెమెరా కంటికి చిక్కింది. జుట్టును బన్‌తో బిగించి కట్టిన ఆమె సన్‌గ్లాసెస్‌తో ఆకట్టుకుంటోంది.
ఇటీవల ఆమె డ్రగ్ కేసులో తన పేరిట కథనాలు రాయకుండా మీడియాను నియంత్రించాలని కోరుతూ ఢిల్లీ హైకుర్టును ఆశ్రయించింది. డ్రగ్ కేసులో తన పేరు బయటకు రావడంతో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి కథనాలు ప్రసారం చేయకుండా, పబ్లిష్ చేయకుండా లీగల్ మార్గాన్ని ఎంచుకుంది రకుల్. ఈ కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఆమె ముంబైలో ఉంది. ఆమెను ఎన్సీబీ ఇంటరాగేట్ చేసింది కూడా. ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాను కూడా ఏజెన్సీ ప్రశ్నించింది. ఈ కేసులో పేర్లు బయటకొచ్చిన ఇతర ప్రముఖ తారలు సారా అలీ ఖాన్, దీపికా పడుకోనే, శ్రద్ధా కపూర్.
ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోంది. ఇందులో పంజా వైష్ణవ్‌తేజ్ హీరో.
![]() |
![]() |