![]() |
![]() |

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ 23 ఏళ్ల కుమార్తె ఐరా ఖాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఐరా చాలా జోవియల్ అని ఆ హ్యాండిల్‌ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పెద్ద ఫిట్‌నెస్ ఔత్సాహికురాలైన ఆమె తరచూ తన వర్కవుట్ వీడియోలు, హెడ్‌స్టాండ్, హ్యాండ్‌స్టాండ్ లాంటి స్టంట్స్ చేస్తున్న పిక్చర్లు షేర్ చేస్తూ ఫాలోయర్స్‌కు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ పోస్ట్‌తో తనలోని కొత్త టాలెంట్‌ను మనకు పరిచయం చేసిందామె. అది.. టాట్టూ ఆర్టిస్ట్‌గా!
.jpg)
తన ఫిట్‌నెస్ ట్రైనర్ నూపుర్ శిఖారే చేతికి తను వేసిన టాట్టూ పిక్చర్, వీడియో క్లిప్‌ను షేర్ చేసిన ఆమె, దాన్ని తన 'ఆల్టర్నేటివ్ కెరీర్'గా అభివర్ణించింది. "బకెట్ లిస్ట్ ఐటమ్ నంబర్ 5. ఇప్పుడే నా మొదటి టాట్టూ వేశాను. నేనే. నన్ను నమ్మిన నూపుర్ శిఖారేకు, దీన్ని సాధ్యం చేసిన ఐరన్ బజ్ టాట్టూస్‌కు థాంక్స్. నాట్ బ్యాడ్ రైట్." అని ఆమె రాసుకొచ్చింది.
.jpg)
ఆ వెంటనే కామెంట్ సెక్షన్‌లో ఐరాను ప్రశంసిస్తూ కామెంట్లు వచ్చాయి. "ఇది క్రేజీ, నేను కూడా నీతో ఓ టాట్టూ వేయించుకోవడానికి రెడీగా ఉన్నా" తరహాలో అవి ఉన్నాయి.
![]() |
![]() |