![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తున్నాయంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయడం సాధారణమైపోయింది. ఇప్పుడు ఆయన జగన్ కి రాజకీయ లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో 'వ్యూహం' అనే మూవీ చేశాడు. నవంబర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని వివాదాల కారణంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాని డిసెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు తాజాగా ఆర్జీవీ ప్రకటించాడు. ఇదిలా ఉంటే అదే రోజు నందమూరి హీరో నటించిన సినిమా విడుదలవుతుండటం విశేషం.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ఉపశీర్షిక. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించాడు. డిసెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున 'వ్యూహం' విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది. మరి వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా వస్తున్న ఈ సినిమా.. నందమూరి హీరో సినిమాపై పైచేయి సాధిస్తుందో లేక చతికిల పడుతుందో చూడాలి.
.webp)
![]() |
![]() |