![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ కోసం మెగా ఫాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో సినిమా లవర్స్ కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర్నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని ప్రకటించకుండానే లీకుల రూపంలో బయటకి వస్తూనే ఉన్నాయి.వాటన్నిటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో దర్శకుడు శంకర్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
గేమ్ చేంజర్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతుంది. చరణ్ మీద ఇతర తారాగణం మీద కొన్ని కీలక సన్నివేశాలని శంకర్ చిత్రీకరించాడు. కాగా నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఈ షెడ్యూల్ కి సంబంధించే శంకర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు.ఈ సినిమాలో నటిస్తున్న చాలా మంది ఆర్టిసులకి టెక్నిషియన్స్ కి సినిమా షూటింగ్ రోజున సెట్స్ కి వెళ్లే వరకు కూడా ఏ సీన్ చేస్తున్నాము అనే విషయం తెలియదు.పైగా ఆర్టిసులకి తాము ఎవరితో కలిసి చెయ్యబోతున్నామనే విషయం కూడా తెలియదు.కేవలం అక్కడికి వెళ్లిన తర్వాతే శంకర్ వారికి సీన్స్ వివరిస్తారు. దీని బట్టి గేమ్ చేంజర్ విషయంలో శంకర్ ఎంత కేర్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

చరణ్ తో కియారా అద్వానీ జోడి కడుతున్న ఈ సినిమాలో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథమహారధులందరు నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని హై వాల్యూస్ తో గేమ్ చేంజర్ ని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
![]() |
![]() |