![]() |
![]() |

ఒక పెద్ద సినిమా విడుదలవుతుంది అంటే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రమోషనల్ టూర్లు, స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు అంటూ తెగ హడావుడి ఉంటుంది. కానీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ సినిమా 'సలార్' విషయంలో మాత్రం అలాంటి హడావుడి కనిపించడంలేదు. ప్రమోషనల్ టూర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటివి లేకుండానే సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
సలార్ టీంని రాజమౌళి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారట. ఈ రికార్డెడ్ ప్రమోషన్ ఇంటర్వ్యూను త్వరలోనే విడుదల చేయనున్నారట. ఈ ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు సలార్ లో ముఖ్యపాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నట్లు సమాచారం. టాప్ డైరెక్టర్ రాజమౌళి యాంకర్ అవతారమెత్తితే ఇంటర్వ్యూ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. సలార్ టీం నుంచి ఆయన ఎలాంటి విషయాలు రాబట్టారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
![]() |
![]() |