![]() |
![]() |

ఈ ఓటీటీ యుగంలో రీమేక్ సినిమాలు చేయాలంటే మేకర్స్ వెనకడుగు వేసే పరిస్థితి. ఎందుకంటే ఓటీటీలో ఇతర భాషల సినిమాలు అందుబాటులో ఉండటంతో.. థియేటర్ కి వెళ్ళి రీమేక్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడంలేదు. ఈమధ్య కాలంలో ఎందరో రీమేక్ సినిమాలతో షాక్ లు తిన్నారు. అయినప్పటికీ కొందరికి రీమేక్ లపై మోజు పోవడంలేదు.
టాలీవుడ్ లో రీమేక్ సినిమాలతో విజయాలు అందుకున్న దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన 'గబ్బర్ సింగ్', 'గద్దలకొండ గణేష్' సినిమాలు రీమేక్ లే. ఇతర భాషల్లో వచ్చిన చిత్రాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తనదైన శైలిలో మలిచి హిట్స్ కొట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ తో ఆయన చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా తమిళ మూవీ 'తేరి'కి రీమేక్ అనే ప్రచారం ఉంది. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఉస్తాద్ కి కాస్త బ్రేక్ వచ్చింది. దీంతో ఈ గ్యాప్ లో రవితేజతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

షాక్, మిరపకాయ్ చిత్రాల తర్వాత రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రకటన తాజాగా వచ్చింది. అయితే ఇది కూడా ఒక హిందీ సినిమాకి రీమేక్ అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా 2018 లో వచ్చిన 'రెయిడ్' ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
![]() |
![]() |