![]() |
![]() |

తమిళ సూపర్ స్టార్ ధనుష్ నుండి వస్తున్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్ ఇటీవలే వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాయి. అలాగే ధనుష్ ఇంకో సారి సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అనే సంకేతాలని కూడా ఇచ్చాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకదాన్ని స్వయంగా ధనుషే ప్రకటించడంతో ధనుష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
ధనుష్ తన ట్విటర్ ద్వారా అతి త్వరలో కెప్టెన్ మిల్లర్ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయాన్నికూడా ధనుష్ తెలిపాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా సంక్రాంతికి థియేటర్స్ లో ఉంటుంది అని కూడా చెప్పాడు. ధనుషే స్వయంగా ఇలా చెప్పేసరికి ఫ్యాన్స్ లో అప్పుడే పండగ వాతావరణం వచ్చింది.
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుంది తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ,నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్ అయినటువంటి ఆర్‌ఆర్‌ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగులో సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ధనుష్ ఎంతవరకు హిట్ కొడతాడో చూడాలి.
![]() |
![]() |