![]() |
![]() |

సహాయక పాత్రలతో కెరీర్ ని ఆరంభించి.. ఆపై పూర్తిస్థాయి కథానాయికగా అవతారమెత్తారు రీతూ వర్మ. 2016లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'పెళ్ళి చూపులు'తో కమర్షియల్ హిట్ ని అందుకోవడమే కాకుండా.. ఉత్తమ నటిగా నంది పురస్కారానికి సైతం ఎంపిక అయ్యారు రీతూ. రైట్ నౌ తెలుగుతో పాటు తమిళ భాషలోనూ సినిమాలు చేస్తూ రెండు పరిశ్రమల దృష్టిని ఆకర్షిస్తున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీ.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రీతూ వర్మ చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నేచురల్ స్టార్ నాని - శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న 'టక్ జగదీష్' కాగా.. మరొకటి శర్వానంద్ బైలింగ్వల్ మూవీ. ఇక మూడోది నాగశౌర్య హీరోగా నటిస్తున్న సినిమా.
శౌర్య - రీతూ జంటగా నటిస్తున్న సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాకి 'వరుడు కావలెను' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు టాక్. మరి.. 'పెళ్ళిచూపులు' భామకి 'వరుడు కావలెను' ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |