![]() |
![]() |

సక్సెస్‌లే సినిమా రంగంలో గౌరవానికి కొలమానం. తాను నటించిన చిత్రాల ద్వారా మొదట్లో విజయాలు అందుకొని, తర్వాత కాస్త వెనుకపడిన రాజ్ తరుణ్ ఇటీవల నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజైన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాతో మరోసారి సక్సెస్‌ను అందుకున్నాడు. యంగ్ డైరెక్టర్ శాంటో డైరెక్షన్‌లో అతను హీరోగా నటిస్తున్న పేరుపెట్టని చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నంద్‌కుమార్ అభినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'జాను', 'చూసీ చూడంగానే' సినిమాల్లో నటించిన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
రాజ్ తరుణ్‌కు హీరోగా ఇది 15వ చిత్రం. ఆయన్ని కొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లా సినిమా ఉంటుంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళతాం అని చెప్పాడు దర్శకుడు శాంటో అలియాస్ మోహన్ వీరంకి. వెన్నెల కిశోర్ కామెడీ బాధ్యతలను తీసుకుంటున్న ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి మ్యూజిక్ డైరెక్టర్‌గా, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. సినిమా ఓపెనింగ్ సందర్భంగా ప్రెస్‌కు రిలీజ్ చేసిన పిక్చర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
![]() |
![]() |