![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో 'ఈగ' ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీలో నాని కనిపించేది కొంతసేపే. అయితే ఆ ప్రభావం మాత్రం సినిమా ఆసాంతం ఉంటుంది. కథానుసారం ఈగగా పునర్జన్మ ఎత్తి.. విలన్ సుదీప్ పై పగ సాధిస్తారు నాని. ఇప్పుడు ఈ 'ఈగ' ప్రస్తావన ఎందుకంటే.. మళ్ళీ ఎనిమిదేళ్ళ తరువాత మరో పునర్జన్మ కథతో నాని సినిమా చేయబోతున్నారు. అదే.. 'శ్యామ్ సింగ రాయ్'. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మరు జన్మ కాన్సెప్ట్ తోనే తెరకెక్కనుందట. అయితే.. 'ఈగ'లోలా కాకుండా ఇందులో రెండో సారి కూడా నానిగానే పుడతారట నాని.
మరి.. నాని కెరీర్ కి 'ఈగ' ఏ విధంగా ప్లస్ అయ్యిందో 'శ్యామ్ సింగ రాయ్' కూడా అదే స్థాయిలో పేరు తెస్తుందేమో చూడాలి. 'శ్యామ్ సింగ రాయ్' లో సాయిపల్లవి, 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి నాయికలుగా నటించనుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందించనున్నారు. డిసెంబర్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
![]() |
![]() |