![]() |
![]() |

`గోపాల గోపాల` (2015) తరువాత విక్టరీ వెంకటేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మల్టిస్టారర్ చేయనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. పవన్ తో `జల్సా`, `అత్తారింటికి దారేది`, `అజ్ఞాతవాసి` వంటి చిత్రాలను రూపొందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మల్టిస్టారర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సీనియర్ స్టార్ వెంకటేశ్ కూడా నటించే అవకాశముందని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, పవన్ ప్రస్తుతం `భీమ్లా నాయక్`, `హరిహర వీరమల్లు` చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే `భవదీయుడు భగత్ సింగ్` త్వరలోనే పట్టాలెక్కనుండగా.. సురేందర్ రెడ్డి డైరెక్టోరియల్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇక వెంకటేశ్ విషయానికి వస్తే.. `దృశ్యం 2` ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుండగా.. `ఎఫ్ 3` సెట్స్ పై ఉంది. మరోవైపు త్రివిక్రమ్.. పవన్ నటిస్తున్న `భీమ్లా నాయక్`కి స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చగా.. త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే.. వెంకీ, పవన్ మల్టిస్టారర్ పట్టాలెక్కే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |