![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నాలుగు సంవత్సరాల పిన్న వయసులోనే చెస్ ట్రైనర్‌గా నోబుల్ బుక్ అవార్డును దక్కించుకుని తల్లితండ్రులతో పాటు తెలుగువారందరూ గర్వపడేలా చేసింది. చదరంగంలో కుమార్తె ఆసక్తిని గ్రహించిన తల్లితండ్రులు అర్జున్, స్నేహారెడ్డి ఆమెను ఒక చెస్ అకాడమీలో చేర్పించి, ట్రైనింగ్ ఇప్పించారు. స్వల్ప కాలంలోనే చెస్ నేర్చుకున్న అర్హ, ఇతర స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయింది. రెండు నెలల కాలంలో 50 మందికి పైగా ఆమె ట్రైనింగ్ ఇచ్చిందంట.
అర్హలోని అరుదైన ప్రతిభ గురించిన తెలిసిన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఇటీవల అర్హను పరీక్షించారు. వారి సమక్షంలో ఆమె తన టాలెంట్‌ను ప్రదర్శించి, కొంతమంది ఔత్సాహిక చెస్ ప్లేయర్స్‌కు ట్రైనింగ్ ఇచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ ప్రతినిధులు ఆమె టాలెంట్‌ను గుర్తించి, వరల్ట్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డును అందజేశారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో అర్హ పలు చెస్ట్ బోర్డులపై ఆట ఆడుతుండటాన్ని, ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడాన్ని చూడొచ్చు. చివరలో ఆమెకు నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్‌తో పాటు మెడల్‌ను కూడా అందజేశారు. అల్లు ఫ్యామిలీ మొత్తం అర్హ సాధించిన ఘనతకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. చివరలో తన కుటుంబంతో అర్హ ఫొటోకు పోజులు కూడా ఇచ్చింది. అర్హను తాతయ్య అల్లు అరవింద్, నాన్న అర్జున్ మురిపెంగా అభినందించారు.
ఆదివారం అర్హ పుట్టినరోజు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో ఆమె బర్త్‌డే వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. గుణశేఖర్ సినిమా 'శాకుంతలం'లో భరతుడి పాత్ర ద్వారా వెండితెరపై త్వరలో ప్రత్యక్షం కానున్నది అర్హ.
![]() |
![]() |