![]() |
![]() |

దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే యాక్టర్ గానూ రాణిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించి మెప్పించిన ఆయన.. ఇప్పుడు సందీప్ కిషన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'మైఖేల్'లో నటించబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఈ ఏడాది ఆగష్టులో సందీప్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ''మైఖేల్'కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు ఈ సినిమా కాస్ట్ లో గౌతమ్ మీనన్ జాయిన్ అయ్యారు.

'మైఖేల్' సినిమాలో గౌతమ్ మీనన్ విలన్ గా నటిస్తున్నట్లు తెలియజేస్తూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చేతి నిండా రక్తంతో, చేతికి బేడీలతో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. సందీప్, సేతుపతి, గౌతమ్ మీనన్ ముగ్గురూ కలిసి 'మైఖేల్' సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
![]() |
![]() |