![]() |
![]() |

విజయ్ దేవరకొండ టైటిల్ రోల్‌లో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న 'లైగర్' మూవీ షూటింగ్ లాస్ వేగాస్‌లో జరుగుతోంది. ఈ సందర్భంలో హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి పరిసర ప్రాంతాల్లో గుర్రాల మీద విహరిస్తున్నారు. లాస్ వేగాస్‌లో తాము ఎలా గడుపుతున్నదీ ఆ ఇద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఆ ఇద్దరూ గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అనన్య, దానికి “Howdy Rowdy” అనే ట్యాగ్ జోడించింది.
రౌడీ అంటే విజయ్ దేవరకొండ అనే విషయం తెలిసిందే. అతని క్లాతింగ్ బ్రాండ్ పేరు 'రౌడీ వేర్' అనే విషయం తెలిసిందే. హార్స్ రైడింగ్‌ను ఆ జోడీ ఎంతగా ఎంజాయ్ చేస్తోందో ఆ ఫొటో తెలియజేస్తోంది. విజయ్‌తో పాటు అనన్య కూడా చాలా కంఫర్ట్‌గా గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించింది.
విజయ్‌తో కలిసి గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోతో పాటు, తనొక్కతే హార్స్ రైడింగ్ చేస్తున్న కొన్ని ఫొటోలను కూడా అనన్య షేర్ చేసింది. వాటిలో ఆమె గుర్రాన్ని మచ్చిక చేసుకుంటున్న ఫొటో కూడా ఉంది. వాటికంటే ముందు లాస్ వేగాస్‌లో ఆహ్లాదకరంగా కనిపిస్తోన్న ఆకాశం ఫొటోను షేర్ చేసిన ఆమె, “You beauty,” అనే క్యాప్షన్ పెట్టి, దానికి “Liger” అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా పెట్టింది.
![]() |
![]() |