![]() |
![]() |

యువ నటుడు కార్తికేయ ఓ ఇంటి వాడయ్యాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో తన ప్రేయసి లోహిత మెడలో మూడు ముళ్ళు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తన అభిమాన హీరో మెగాస్టార్ వచ్చి ఆశీర్వదించడంతో కార్తికేయ ఆనందం వ్యక్తం చేశాడు.
బి.టెక్ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయ, లోహిత ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. ఇటీవల 'రాజా విక్రమార్క' ప్రీరిలీజ్ ఈవెంట్ లో కార్తికేయ తన ప్రేయసని పరిచయం చేశారు. అంతేకాదు స్టేజ్ పైనే ప్రేయసకి ప్రపోజ్ చేసి ప్రేయసితో తో పాటు ఆడియన్స్ ని కూడా సర్ ప్రైజ్ చేశాడు. ఇప్పుడు పెద్దల సమక్షంలో సంతోషంగా తన ఇష్టపడిన అమ్మాయిని పెళ్ళాడాడు.

'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తికేయ.. తన రెండో సినిమా 'ఆర్ఎక్స్ 100'తో సూపర్ సక్సెస్ అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గానూ రాణిస్తున్నాడు. నాని 'గ్యాంగ్ లీడర్'తో తెలుగు ప్రేక్షకులకు తన విలనిజం పరిచయం చేసిన కార్తికేయ.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ అజిత్ 'వాలిమై'లో విలన్ గా నటిస్తున్నాడు.
![]() |
![]() |