![]() |
![]() |

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ నాయికగా ఓ వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. ఈ రెండు భాషల్లో ఆమెకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా తనదైన మార్కు నటనతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం హోట్ ఫేవరేట్‌గా నిలిచింది. స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుని భారీ డిమాండ్ వున్నా ఎలాంటి కమర్షియల్ యాడ్‌లలో నటించడానికి ఆసక్తిని చూపించకుండా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
మెగాస్టార్ చెల్లెలి పాత్ర కోసం భారీ గా పారితోషికం ఇస్తామని ఆఫర్ ఇచ్చినా ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించి పలువురిని ఆశ్చర్యపరిచింది. ఇదిలా వుంటే హీరోయిన్‌గా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న సాయిపల్లవి త్వరలో తన సోదరిని నటిగా పరిచయం చేయబోతోంది. సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ ఓ తమిళ సినిమాతో నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది. `చితిరై సెవన్నమ్` పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి స్టంట్ మాస్టర్ సిల్వ డైరెక్టర్. సముద్రఖని, రీమా కలింగల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని హీరో ధనుష్ ఇటీవల సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ 3న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాతో సాయి పల్లవి సోదరి పూజా కుమార్ తన అక్క మ్యాజిక్‌ని రిపీట్ చేసి ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తుందా? .. లేదా అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 న జీ5లో స్ట్రీమింగ్ కానున్న `చితిరై సెవన్నమ్` రిజల్ట్ బయటికి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |