![]() |
![]() |

దక్షిణాది కథానాయికలు నయనతార, కీర్తి సురేశ్, సాయి పల్లవి అభినయ పటిమ ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ దరికి చేరిన పాత్రలకు ప్రాణం పోసే ఈ ముగ్గురు అగ్ర కథానాయికలకు కూడా ఈ జూన్ 17 పరీక్షా కాలం కానుంది. ఎందుకంటే.. అదే రోజు ఈ స్టార్ బ్యూటీస్ కొత్త చిత్రాలు జనం ముందుకు రాబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ఎనిమిదేళ్ళ పిల్లాడికి తల్లిగా నయనతార నటించిన తమిళ చిత్రం `O2`. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 17న థియేటర్స్ లో కాకుండా ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా స్ట్రీమ్ కానుంది. తెలుగులోనూ ఈ చిత్రం అనువాద రూపంలో అలరించే అవకాశముంది. ఇక అదే రోజున కీర్తి సురేశ్ నటించిన మలయాళ చిత్రం ఒకటి రిలీజ్ కాబోతోంది. అదే.. `వాషి`. ఇందులో లాయర్ రోల్ లో ఎంటర్టైన్ చేయనుంది కీర్తి. అలాగే, అదే జూన్ 17న సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా `విరాట పర్వం` విడుదల కాబోతోంది. నక్సలిజం నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో.. మరోమారు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో దర్శనమివ్వనుంది సాయిపల్లవి. మరి.. ఒకే రోజున కొత్త చిత్రాలతో పలకరించబోతున్న నయన్, కీర్తి, సాయి పల్లవిలో ఎవరెవరు ఇంప్రెస్ చేస్తారో చూడాలి.
![]() |
![]() |