![]() |
![]() |

లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మధుదీప్ సి.హెచ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అరవింద్.ఎమ్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. త్రిగున్-పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు. ఈ చిత్రం నుంచి "వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే.. నిన్నలో మొన్నలో లేని వన్నెలే పూచెలే" అనే పల్లవితో సాగే సాంగ్ ను ఇటీవల విడుదల చేయగా అనూహ్యమైన స్పందన లభిస్తోంది.
"ఒకే ఒక లోకం నువ్వే..." పాటతో సంచలనం సృష్టించిన అరుణ్ చిలువేరు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా ఎన్.సి.కారుణ్య ఆలపించారు. ఇటీవల ఈ సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ 1 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించింది. ఈ పాటకు లభించిన మిలియన్ వ్యూస్ తమ హీరోకు బర్త్ డే కానుకగా అందిస్తున్నామని దర్శకనిర్మాతలు అన్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జూన్ 8, హీరో త్రిగున్ పుట్టినరోజును పురస్కరించుకుని మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ మోషన్ పోస్టర్ కు తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రవి.వి, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరావు వర్క్ చేస్తున్నారు.
![]() |
![]() |