![]() |
![]() |

'వాన'(2008) సినిమాతో హీరోగా ఆకట్టుకున్న వినయ్ రాయ్ ఇప్పుడు విలన్ గా మారి అదరగొడుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ సినిమాలు 'డిటెక్టివ్', 'వరుణ్ డాక్టర్', 'ఈటీ'లలో నెగటివ్ రోల్స్ లో నటించి మెప్పించిన ఆయన.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి వస్తున్న ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో విలన్ గా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు.
'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'హనుమాన్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రని రివీల్ చేశారు. రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేసిన పోస్టర్ మైఖేల్ గా వినయ్ లుక్ ఆకట్టుకుంటోంది.

అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.
![]() |
![]() |