![]() |
![]() |
.webp)
జూన్ 3న 'మేజర్', 'విక్రమ్' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతూ ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరయ్యాయి. తెలుగులో ఫస్ట్ వీకెండ్(మొదటి మూడు రోజులు) 'మేజర్' డామినేషన్ ఎక్కువగా కనిపించింది. అయితే నాలుగో రోజు నుంచి పరిస్థితి మారిపోయింది. నాలుగో రోజు నుంచి తెలుగులో 'విక్రమ్' పైచేయి సాధిస్తుండటం విశేషం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులు 'మేజర్'కి రూ.4.07 కోట్లు, రూ.3.61 కోట్లు, రూ.3.57 కోట్ల షేర్ రాగా.. 'విక్రమ్'కి రూ.1.96 కోట్లు, రూ.2 కోట్లు, రూ.2.59 కోట్ల షేర్ వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి మూడు రోజుల్లో మేజర్ కి 11.25 కోట్ల షేర్ రాగా.. విక్రమ్ కి 6.55 కోట్ల షేర్ వచ్చింది.
ఇక నాలుగో రోజు(సోమవారం) ఈ రెండు సినిమాలు మండే టెస్ట్ పాసైనప్పటికీ 'మేజర్'పై 'విక్రమ్' కాస్త పైచేయి సాధించింది. నాలుగో రోజు మేజర్ 1.34 కోట్ల షేర్ రాబట్టగా, విక్రమ్ 1.35 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే ఐదో రోజు కూడా విక్రమ్ దే డామినేషన్ కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు మేజర్ కి 1.07 కోట్ల షేర్ రాగా, విక్రమ్ కి 1.28 కోట్ల షేర్ వచ్చింది.
మేజర్ డైరెక్ట్ తెలుగు సినిమా, పైగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ తమిళ్ డబ్బింగ్ మూవీ 'విక్రమ్' బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. స్టార్స్ నటించిన సినిమా కావడంతో పాటు, యాక్షన్ ప్రియులను అలరించే అంశాలు ఉండటంతో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో 'మేజర్'కి 13.66 కోట్ల షేర్ రాగా.. 'విక్రమ్'కి 9.18 కోట్ల షేర్ వచ్చింది. నాలుగు రోజు నుంచి పైచేయి సాధిస్తున్న 'విక్రమ్' ఫుల్ రన్ లో తెలుగులో 'మేజర్' కలెక్షన్స్ ని బీట్ చేసినా ఆశ్చర్యంలేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
![]() |
![]() |